జాతీయస్థాయిలో విజయవంతమైనందునే..

– రాష్ట్రంలోనూ హామ్ మోడల్ అమలుకు నిర్ణ‌యం
– ప్రభుత్వ వివరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : జాతీయస్థాయిలో, తర్వాత ఏడు రాష్ట్రాల్లో విజయవంతమైౖనందున దీర్ఘకాలిక నిర్వహణ (15 సంవత్సరాలు)తో పాటు ఆర్థిక వృద్ధికి దోహదం చేయడం, కొత్త పరిశ్రమలు స్థాపనకు అవకాశం కల్పించడం, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం వంటి లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం కూడా హామ్ విధానంలో రహదారుల అభివృద్ధిని చేపట్టాలని నిర్ణయించింది. ఎన్‌హెచఏఐ హామ్ మోడల్ ప్రకారం నిర్మాణ కాలంలో ప్రభుత్వం నిర్మాణ ఖర్చులో 40% చెల్లిస్తుందని, మిగిలిన 60 శాతాన్ని 15 సంవత్సరాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాలంలో యాన్యుటీల రూపంలో చెల్లిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. హామ్‌ను ఎన్‌హెచ్ఏఐ 2016లో స్వీకరించి ఇప్పటివరకు 374కి పైగా ప్రాజెక్టులను, సుమారు రూ.4.0 నుంచి 5.0 లక్షల కోట్ల మొత్తం పెట్టుబడితో కేటాయించిందని తెలిపింది. హామ్ కింద ఫేజ్-1కు రూ.13,006.27 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 441 రహదారులు మొత్తం 6092.37 కి.మీ. పొడవుతో 34 ప్యాకేజీలుగా విభజించింది. రూ.12,152 కోట్ల అంచనాతో 34 ప్యాకేజీలకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లో టెండర్లు ఆహ్వానించగా 27 జాతీయస్థాయి పోటీదారులు పాల్గొన్నారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ అనంతరం 31 ప్యాకేజీలకు బిడ్డర్లు అర్హత సాధించగా మÖడు ప్యాకేజీలకు ఎవరూ అర్హత సాధించలేదని తెలిపింది. అందువల్ల ఆ మÖడింటికి రెండోసారి టెండర్లు పిలిచారు. టెండర్లు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతం ఇవి టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. హామ్ ఫేజ్-1 టెండర్లను తెరిచి పరిశీలించగా బిడ్డర్లు 15% నుంచి 23% వరకు అధికంగా కోట్ చేసినట్లు తెలిసింది. దీనికి కారణాలు నిర్మాణ ఖర్చులో 60%పై వర్తించే జీఎస్‌టీని కాంట్రాక్టర్ నిర్మాణ కాలంలో ముందుగా చెల్లించాలి. అయితే ఈ మొత్తం 15 సంవత్సరాల యాన్యుటీ చెల్లింపుల కాలంలో వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తుంది. ఈ వాయిదా వల్ల కలిగే వడ్డీ భారం సుమారు 9.30%గా అంచనా వేశారు. ఎన్‌హెచఏఐ హామ్ ప్రమాణాల ప్రకారం ప్రతి 70 కి.మీ కు ఒక పాట్రోలింగ్ వాహనం, ఒక అంబులెన్స్‌ను 15 సంవత్సరాల యాన్యుటీ కాలంలో నిర్వహించాలి. ఈ ఖర్చు అంచనాలో పొందుపరచలేదు. దీనివల్ల సుమారు 4-5% అదనపు భారం ఏర్పడుతోంది. ఇండిపెండెంట్ ఇంజనీర్ (ఐఈ) చార్జీలలో 1% కాంట్రాక్టర్ భారం ఉన్నా ఈ అంశం అంచనాలో పొందుపరచలేదు. పైన పేర్కొన్న అన్ని అంశాలను కలిపి చూస్తే అంచనాలో లేని ఈ ఖర్చులు సుమారు 15% వరకు ఉంటాయి.

ఇతర రాష్ట్రాల్లో హామ్ టెండర్లు ఇలా..

బీహార్-17.16% నుంచి 26%, గుజరాత్-17.42% నుంచి 66.46%, కర్ణాటక- 14.68% నుంచి 23.60%, మహారాష్ట్ర- 18% నుంచి 47.74%, రాజస్థాన్- 13.3%, తమిళనాడు- 44.2%, ఎన్‌హెచ్ఏఐ 1 % నుంచి 50.35%, ఆంధ్రప్రదేశ్ – స్పందన లేదు. హామ్ మోడల్ ప్రకారం 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ బ్యాంక్ గ్యారంటీపై ఇవ్వనున్నారు. దీనికి తగిన వడ్డీ వర్తిస్తుంది. ఈ అడ్వాన్స్, వడ్డీ మొత్తం టాప్ 5 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ సగటు +1.25% వడ్డీతో 10 వాయిదాలలో కాంట్రాక్టర్ రన్నింగ్ బిల్లుల నుంచి తిరిగి వసూలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో 94, ఇరిగేషన్ అండ్ కాడ్ (పీడబ్ల్యూ-సీవోడీ) శాఖ తేదీ: 1-07-2003 సీరియల్ నం.17 ప్రకారం కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ నిబంధనలు ఉన్నాయి.

మొబిలైజేషన్ అడ్వాన్స్

రూ.1 కోటి కంటే ఎక్కువ విలువైన పనులలో కాంట్రాక్టర్‌కు కాంట్రాక్ట్ విలువలో 10% వరకు బ్యాంక్ గ్యారంటీపై అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి వడ్డీ వర్తిస్తుంది. ఈ అడ్వాన్స్, వడ్డీ కాంట్రాక్టర్ బిల్లుల నుంచి తగిన వాయిదాలలో తిరిగి వసూలు చేయనున్నారు. పై ఎన్‌హెచఏఐ హామ్ మోడల్, రాష్ట్ర ప్రభుత్వ జీవో 94 ప్రకారం రూ.12,152 కోట్ల టెండర్లపై 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే రూ.1,215 కోట్లు మాత్రమే. ఈ మొత్తం వడ్డీతో కాంట్రాక్టర్ బిల్లుల నుంచి తిరిగి వసూలు చేయనున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవడం అన్ని కన్సెషనేర్లకు తప్పనిసరి కాదు. వడ్డీ ఉండటం వల్ల చాలామంది దీనిని తీసుకోకపోవచ్చు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *