– భద్రకాళి ఆలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని
వరంగల్, ప్రజాతంత్ర, జూలై 15 : వరంగల్ మహానగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేÔమ్రైన భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్ర మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి ఉత్సవానుజ్ఞ ప్రార్ధన జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, ఉత్సవ పూర్వాంగ విధిని అర్చకులు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి-నీలిమ దంపతులు ఉత్సవాలను ప్రారంభించారు. రాజేందర్ రెడ్డికి ఆలయ ఈవో రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి షడ్బేరాలలో అమ్మవారి ఎదురుగా ఉన్న బేరాన్ని(మూర్తి) కాళీ మాతగా, మహామండపంలోని బేరాన్ని కామేశ్వరి మాతగా అలంకరించి ఆ²రాధనలు జరిపారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ డాక్టర్ కావ్య
భద్రకాళి అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీకి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో జిల్లా దశాబ్దాల కలగా ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు సాకారమవుతున్నాయన్నారు. మామునూరు విమానాశ్రయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. వరంగల్‌ను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో టెంపుల్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, కాకతీయుల కళా వైభవానికి ప్రతీకలైన చారిత్రక కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ సంపదను ప్రపంచానికి మరింత చేరువ చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. పర్యాటకుల రాక పెరగడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయన్నారు. భద్రకాళి ఆలయం మాడవీధుల అభివృద్ధితోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చిత్తశుద్ధితో కొనసాగుతున్నాయని తెలిపారు. భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల ఆలయం, చిల్పూరు బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కేంద్ర ప్రభుత్వ పర్యాటక, ప్రసాద్ పథకాల పరిధిలోకి తీసుకొచ్చి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. భక్తులందరికీ అన్న ప్రసాద వితరణను భద్రకాళి భక్త సేవా సమితి కన్వీనర్ అయిత గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




