– గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన విద్య
– పేద విద్యార్థులకు అన్యాయం చేశారు
– త్వరలో 9 రకాల విద్యా కిట్‌ల పంపిణీ
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
వనపర్తి, ప్రజాతంత్ర, జులై 15: గతంలో రాష్ట్రంలో వెనుకబడిన విద్య స్థానాన్ని ప్రస్తుతం మెరుగుపరుచుకుంటూ ఒకటవ స్థానానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు, జిల్లాలోని కొత్తకోట ప్రభుత్వ బాలికల హై స్కూల్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనాడు ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని జిల్లా పేరు నిలబెట్టాలని ఆత్మగౌరవంతో బతకాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు ఆనందం పొందే విధంగా నాణ్యతమైన చదువు ఇప్పించాలని ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ లను మొదలుకొని ప్రభుత్వ పాఠశాలను మొత్తం నిర్లక్ష్యం చేసి పేద ప్రజలకు విద్యను దూరం చేసిన ఘనత గత ప్రభుత్వాన్నిదాని ఆయన అన్నారు. ఉదాహరణకు 44వ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట బాలికల పాఠశాలను పట్టించుకోకుండా చెట్ల కిందనే చదువుకుంటున్నారని ఎన్నికల ముందు ఇది చూసిన ప్రస్తుత ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నా దృష్టి తీసుకొచ్చిన వెంటనే నిధులు కేటాయించి పాఠశాల నిర్మాణం పూర్తిచేశామని ఆయన అన్నారు, గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో గతంలో 35, 36 స్థానంలో ఉన్న విద్య నేడు 18వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వం దక్కిందని ఈ ఘనత ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులదని ఆయన అన్నారు, ప్రస్తుతం 26 వేల పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని 11000 ప్రైవేట్ పాఠశాలలో 32 వేల మంది విద్యార్థులే ఉన్నారని గత పది సంవత్సరాలలో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు భారీగా చేరారని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికోసం ప్రభుత్వ టీచర్లనే విదేశాలకు పంపి విద్యపై అవగాహన కల్పించే విధంగా ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు, తెలంగాణలో 9 రకాల ఎడ్యుకేషన్ కిట్టు పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు ప్రభుత్వ బడిలో మంచి చదువు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలని ఒకవేళ ఎవరైనా అవహేళన చేస్తే ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలో చదివాడని ఉదాహరణ చూపెట్టాలని ఆయన అన్నారు మంత్రులు దూదిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి మంత్రులయాలని విద్యార్థులు ప్రతి ఒక్కరు గమనించాలని ఆయన అన్నారు ప్రభుత్వ పాఠశాల ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 1, 8 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు, ప్రతి విద్యార్థి చదువులు ఉన్న రాణించాలి లేకపోతే మైదానంలో వెళ్లి క్రీడల లో రాణించాలని ఆయన విద్యార్థులను కోరారు చదువులో రాణించలేని సిరాజ్ ఏ ఉద్యోగానికి కూడా పనికిరాడు అని కానీ క్రీడలు రాణించినందుకు గ్రూపు వన్ జాబ్ ఇప్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి వారు కూడా చాలామంది ఉద్యోగాలు పొందాలని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల రాణిస్తే ఉద్యోగాలు పొంది తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాలని ఆయన కోరారు..
ఇంటి పేరు మార్చుకున్నా చదువును పట్టించుకోలేదు
వనపర్తి జిల్లాలో ఒక మాజీ ప్రతినిధి ఇంటి పేరు నీళ్లు అని మార్చుకున్నాడు కానీ గతంలో చదువులు మాత్రం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు, నేను ఈ జిల్లాలో నే బాల్య జీవితం గడిపానని జిల్లాలో ఉన్న సమస్యలని తనకు తెలుసని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు. జూపల్లి కృష్ణారావు. వాకిటి శ్రీహరి. ఎంపీ మల్లు రవి. ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి మెఘా రెడ్డి కుచ్చుకుల రాజేశ్వర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. శివసేన రెడ్డి. సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
చైనాతో ‘అమర రాజా’ పోటీ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 15 : పాలమూరు జిల్లాను పారిశ్రామికంగా, ఆర్థికంగా అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని దివిటిపల్లిలో అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎనర్జీ బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మం త్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, అమరరాజా సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్, ఎండి విక్రమాదిత్యలతో కలిసి ముఖ్య మంత్రి బుధవారం ఘనంగా ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాలుష్యం వేగంగా విస్తరిస్తోందని, వాతావరణంలో మార్పులు వేగంగా వస్తున్నాయని, ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కాలుష్యం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందంటూ కాలుష్య నియంత్రలో ఈవీ వెహికిల్స్ అవసరం ఉందని అన్నారు. దివిటిపల్లి అమర రాజా యూనిట్‌లో 700మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇందులో 400మంది మహిళా ఉద్యోగులు ఉండటం మహిళా సాధికారితకు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వాల పాలసీల్లో ఉన్న మంచిని మేం ప్రోత్సహిస్తున్నామని, తమ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా ఇండ్రస్ట్రియల్, టూరిజం, హెల్త్ ఇలా అనేక పాలసీలను వమ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం తెలంగాణ వాటాగా ఉంది.. దీన్ని 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని అన్నారు. అమర రాజా లాంటి సంస్థలు తెలంగాణ రైజింగ్‌కు మద్దతుగా ఉంటున్నాయన్నారు. తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్.. రాష్ట్రంలో మౌలిక సదుపాయలను మెరుగుపరుస్తున్నామని, తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించి పాలసీలు రూపొందించి ముందుకు వెళ్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే మౌలిక సదుపాయాలు ముఖ్యమని, పారదర్శకంగా విధానాలు రూపొందించుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. తాను పాలమూరు బిడ్డను అని, ఆదర్శవంత జిల్లాగా మహబూబ్ నగర్‌ను తీర్చిదిద్దుతున్నామని, ఒకప్పుడు కరవు జిల్లాగా ఉండే మహబూబ్‌నగర్ ఇప్పుడు ఇతర జిల్లాలను దత్తత తీసుకునే స్థాయికి ఎదిగిందని చెప్పారు. విద్యలో భాగంగా త్రిబుల్ ఐటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ఏటీసీ సెంటర్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ జిల్లాలో ఏర్పాటు చేశామని, బ్లూ కాలర్ జాబ్‌ల కోసం ఏటీసీలు, పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, బీమా, ఆర్డీఎస్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని వివరించారు. త్వరలోనే ఈ జిల్లా ప్రజలకు శుభవార్త వినిపించనున్నామని. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు సాధించే దిశగా పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయని, డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీ కేటాయింపులపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టించి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పాలమూరు జిల్లాలో చాలామంది రైతులు అమర రాజాకు భూములు ఇచ్చారని, అత్యధిక ఉద్యోగాలు వాళ్లకు ఇవ్వాలని కోరుతున్నానని ఆ సంస్థ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఆర్ అండ్ బీ మంత్రిగా గల్లా జయ్‌దేవ్ తల్లి గల్లా అరుణ కొడంగల్‌లో చాలా రోడ్లు మంజూరు చేశారని, తాను రెండోసారి గెలవడానికి అవి ఉపయోగపడ్డాయని రేవంత్ గుర్తు చేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





