– రేపటినుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ప్రదర్శన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా ఈనెల 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ బాల మాయాదేవి తెలిపారు. బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల చేతివృత్తుల ఉత్పత్తులు ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి.హెచ్. హనుమంతరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.గత ఏడాది 30 స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 60 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేతివృత్తులు కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మేదరి, చేనేత, పూసల తదితర సంప్రదాయ కులవృత్తులకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశాన్ని ఈ మేళా కల్పిస్తుందని ఆమె వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ మేళాను సందర్శించి సంప్రదాయ చేతివృత్తులను ఆదరించి మేళాను విజయవంతం చేయాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



