– కరవుపై బీఆర్ఎస్ నీచ రాజకీయం
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
– నీటి కోసం కర్ణాటక సీఎంతో మంతనాలు.. సానుకూల స్పందన
– పంటలను కాపాడతాం.. వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం
– నేరేడుచర్లలో రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

నేరేడుచర్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రధాన ప్రతిపక్షం కరవు రావాలని, పంటలు ఎండిపోవాలని కోరుకుంటూ పైశాచికానందం పొందేందుకు ప్రయత్నిస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకృతి కారణంగా ఏర్పడిన వర్షపాత లోటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని దుయ్యబట్టారు. రైతుల కష్టాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చుకోవడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష లక్షణం కాదని మండిపడ్డారు. నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో రూ.26.40 కోట్లతో నిర్మించిన నేరేడుచర్ల-దూపాడు డబుల్ రోడ్డును మంత్రి ఉత్తమ్ బుధవారం ప్రారంభించారు. రూ.20 లక్షలతో నిర్మించిన జానల్దిన్నె గ్రామ పంచాయతీ భవనం, రూ.33 లక్షలతో నిర్మించిన నేరేడుచర్ల గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. మొత్తం రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో అనేది ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే శాస్త్రీయ పరిణామం.. భారత రుతుపవనాలపైనా దాని ప్రభావం పడుతుంది.. ఈసారి వర్షపాతం దాదాపు 40 శాతం తగ్గింది.. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రభుత్వంపై విషప్రచారం చేయడం బీఆర్ఎస్ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం అని విమర్శించారు. పొలంలో పంట ఎండిపోతే ప్రభుత్వానికి బాధ కలుగుతుంది.. బీఆర్ఎస్కు మాత్రం రాజకీయ అవకాశం కనిపిస్తోంది. రైతు కన్నీటిలో ఓట్లు వెతకడం కంటే నీచమైన రాజకీయం మరొకటి ఉండదు అంటూ విరుచుకుపడ్డారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ కాపాడి ప్రజల అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పంటలను కాపాడడం, రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తోందన్నారు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని వెతికేది కాంగ్రెస్ ప్రభుత్వం.. సమస్య మరింత పెరగాలని కోరుకునేది బీఆర్ఎస్.. తాము రైతు పంటను కాపాడేందుకు నీళ్ల కోసం రాష్ట్రాల తలుపులు తడుతున్నాం అని చెప్పారు.
జూరాల ఆయకట్టు కింద పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌తో మంతనాలు జరిపినట్లు ఉత్తమ్ వెల్లడించారు. తనకున్న వ్యక్తిగత స్నేహాన్ని రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం వినియోగించానని చెప్పారు. రాష్ట్ర విజ్ఞప్తికి డీకే సానుకూలంగా స్పందించారని, నీటి లభ్యతను పరిశీలించి సహకరించేందుకు హామీ ఇచ్చారని వివరించారు. ‘మేం కర్ణాటకతో మాట్లాడి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.. బీఆర్ఎస్ నేతలు మాత్రం రైతుల్లో భయం సృష్టిస్తున్నారు.. మాకు రాజకీయాల కంటే పంటలు ముఖ్యం.. ప్రచారం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం’ అని మంత్రి స్పష్టం చేశారు. ప్రకృతిని శాసించలేము.. కానీ ప్రజలను కాపాడే బాధ్యత నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్లం’ అని ప్రకటించారు. ప్రజల అవసరాలకనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంతో తనకు ఉన్నది రాజకీయ సంబంధమే కాదు.. ప్రజలతో పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధం.. మీ శ్రమ, ప్రేమ, ఆదరాభిమానాలతోనే ఆరుసార్లు శాసనసభకు, ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యాను.. మీ రుణాన్ని అభివృద్ధితోనే తీర్చుకుంటా’ అని చెప్పారు. పార్టీకి కార్యకర్తలు, నాయకులే వెన్నెముక అని మంత్రి అన్నారు. వారి కృషి, ప్రజల విశ్వాసంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కోదాడ మెగా జాబ్ మేళా విజయవంతం కావడం ఈ ప్రాంత యువతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. రోడ్లు, భవనాలు నిర్మించడం అభివృద్ధిలో ఒక భాగం.. కానీ ఒక యువకుడికి ఉద్యోగం వచ్చి అతని కుటుంబంలో వెలుగు నిండితే అంతకంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు.. కోదాడ మెగా జాబ్ మేళా విజయం ప్రజల ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో నిరూపించింది అని ఉత్తమ్ అన్నారు. ప్రజా సంక్షేమం, రైతుల రక్షణ, యువతకు ఉపాధి, గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ అవాస్తవ ప్రచారాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు