రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను గాలికి వదిలేసి, ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎన్.వి. సుభాష్ దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేల ఆలయాలను అభివృద్ధి చేస్తుంటే, తెలంగాణాలో ఐదు ఆలయాలనైనా రేవంత్ ప్రభుత్వం పట్టించుకుందా అని ప్రశ్నించారు. ముఖ్యంగా, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఇండీకూటమి దేశంలోని మహిళల హక్కులను కాలరాశాయని సుభాష్ ఆరోపించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక రీతిలో తీసుకువస్తే, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కేవలం రాజకీయ లబ్ది కోసం అడ్డుకున్నాయని విమర్శించారు. మహిళా సాధికారత పట్ల ఈ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దేశ ప్రజలు గమ నించారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య పెరిగి యువత భవిష్యత్తు నాశనమవుతున్నా, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దోచుకోవడం-దాచుకోవడం-పం చుకోవడం అనే పద్ధతిలో సాగుతున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల ‘ఫిక్సింగ్ పాలిటిక్స్’ ను ప్రజలు గమనించాలని, బిజెపి ఎప్పుడూ ప్రజా పక్షాన పోరాడు తుందని ఈ సందర్భంగా ఎన్.వి. సుభాష్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *