– జగిత్యాల సభా వేదికపై ప్రకటించిన కేసీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారంటేనే ఊపు వస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మా త్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కోరారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద స భ వేదికపై జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరా రు. ఆయనకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాని ప్రకటించారు. 45 ఏండ్ల నుంచి మేం స్నేహితులం. భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడి విడిగా పనిచే శామని తెలిపారు. కానీ తమ స్నేహంలో లేదని పేర్కొన్నారు. బా ధలు, సుఖాలు, అభిప్రాయలను పంచుకునేవాళ్లమని పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి ఉండే నిబద్ధత, ప్రజా జీవితంలో పనిచేసి న పద్ధతి ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ఆయన ఒక్క జగిత్యాలలోనే కాదు.. పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, పొరుగున ఉన్న అనేక జిల్లాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. జగిత్యాల అభివృద్ధిని ఏమాత్రం విస్మ రించలేదని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





