ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి, ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ప్లాంట్ లో పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయాందోళనలో బయటకు పరుగులు తీశారు. ఈ ఫార్మా కంపెనీలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు కనీసం ఎలాంటి ఫైర్ కంట్రోల్ పరికరాలు లేకపో వడంతో పరిసర కంపెనీల కార్మికులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదాలతో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో తరచూ రియాక్టర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్స్ వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడినవారు గాయాలపా లవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫ్యాక్టరీల్లో మేనేజ్మెంట్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీసర్ల పర్యవేక్షణ లేదన్న విమర్శలు ఉన్నాయి. గ్యాస్, బయో ఫ్యుయల్ ఆధారిత ఫ్యాక్టరీల్లో గ్యాస్ చాంబర్, రియాక్టర్లు, కెమికల్ వేస్టేజ్, విషవాయువులు నిండి రియాక్టర్లు పేలడం, గ్యాస్ లీక్ అవడం, షాక్ సర్క్యూట్స్ వంటి ఘటనలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. కెమికల్ ఫ్యాక్టరీల్లో పని చేయించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అన్స్కిల్డ్ లేబర్ పని చేయించుకుంటున్నారు. దీంతో వీరికి సరైన అవగాహన లేక అత్యవసర టైంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *