అడ్వకేట్ హత్య కేసులో స్కార్పియో స్వాధీనం

– లోతుగా విచారిస్తున్న పోలీస్ బృందాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ వద్ద కారుతో ఢీకొని న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేసిన కేసులో నిందితులను పట్టుకోవాలని ఆయన కుమారుడు నగర్ పోలీస్ కమిషనర్‌ను కోరారు. తనకున్న అనుమానలతో ఆధారాలను వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన స్కార్కియో వాహనాన్ని బెంగళూరు హైవేపై స్వాధీనం చేసుకున్నారు. భూ తగాదాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించినట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఖాజా మొయినుద్దీన్‌ను నిందితులు వాహనంతో ఢీకొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ కారును గతంలో విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే తాను ఆ వాహనాన్ని ఆరు నెలల క్రితమే అమ్మేశానని వాహన యజమాని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వాహనం ఎవరి వద్ద ఉందన్న దానిపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కల్వకుర్తికి చెందిన వినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరికొందరు అనుమానితుల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *