సర్పంచ్‌ల ప్ర‌మాణ‌స్వీకారం తేదీ మార్పు

– మహూర్తాలు లేకపోవడమే కారణం
– ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో 22కు వాయిదా 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ వాయిదా పడిరది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే ముహూర్తాల కారణంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం వాయిదా పడిరది. 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవని, 22కు వాయిదా వేయాలని ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వారి విజ్ఞప్తులపై పంచాయతీరాజ్‌ శాఖ సానుకూలంగా స్పందించింది. సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ తేదీని 22వ తేదీకి మార్పు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే రోజున నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరోజున జరిగే మొదటి సమావేశంలో కొత్త పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. ’గ్రామ పంచాయతీ సర్పంచినైన/సభ్యుడినైన నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రతిజ్ఞ చేయనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page