దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు

– ధరల్లో అనూహ్యంగా భారీ పెరుగుదల

న్యూదిల్లీ, డిసెంబర్‌ 17: మంగళవారం కాస్తంత తగ్గినట్టు అనిపించిన బంగారం, వెండి ధరలు బుధవారం ట్రేడిరగ్‌ ప్రారంభం కాగానే ఆకాశాన్ని తాకాయి. వెండి ధర వేగంగా పెరగడం చూసి జనాలు హడలిపోతున్నారు. గుడ్‌రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటలకు భారత్‌లో 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,510కు చేరుకుంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.650 అధికం. ఇక 22 క్యారెట్‌ ఆభరణాల పసిడి ధర కూడా రూ.600 మేర పెరిగి 1,23,300కు చేరుకుంది. చెన్నైలో 24 క్యారెట్‌ పసిడి (10 గ్రాములు) ధర గరిష్ఠంగా రూ.1,35,280కు చేరుకుంది. హైదరాబాద్‌, విజయవాడల్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,24,000గా హైదరాబాద్‌, విజయవాడల్లో రూ.1,23,300గా ఉంది. ఇక ట్రేడిరగ్‌ మొదలైన గంటల వ్యవధిలోనే వెండి ఏకంగా రూ.8900 మేర పెరిగి రూ.2,08,000కు చేరుకుంది. కిలో వెండి ధర చెన్నైలో అత్యధికంగా రూ.2,22,000 ఉంది. హైదరాబాద్‌, విజయవాడల్లో కూడా ధర ఇదే రేంజ్‌లో కొనసాగుతోంది. బుధవారం ట్రేడిరగ్‌లో బంగారం ధరలు అర శాతం మేర పెరగ్గా వెండి ఏకంగా 4 శాతం మేర పెరిగిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో నిరుద్యోగిత పెరుగుతుండటంతో ఫెడ్‌ రేట్‌ కోత మళ్లీ ఉంటుందన్న అంచనాలు, ఇతర సానుకూల భౌగోళిక రాజకీయ అంశాలతో ధరలకు రెక్కలొచ్చాయంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page