– స్థానిక నాయకుడు సహా మరో ఇద్దరి సజీవదహనం
రాయపూర్, జూన్ 18: ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నాయకుడు, జన్‌పద్ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ భరత్ సింగ్, మరో ఇద్దరు సజీవదహనమయ్యారు. కొరియా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం స్థానికంగా ఇసుక తవ్వకాల కాంట్రాక్టును భరత్ సింగ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో మనోజ్ త్రిపాఠీ వర్గంతో భరత్ సింగ్‌కు వివాదం మొదలైంది. ఇసుక తవ్వకాలకు వాడే టిప్పర్ ట్రక్‌లు త్రిపాఠీ కుటుంబానికి చెందినవని స్థానికులు తెలిపారు. దీంతో ఇసుక తరలింపు, చెల్లింపుల విషయంలో భరత్ సింగ్, త్రిపాఠీ వర్గాల మధ్య వివాదం మొదలైంది. చివరకు ఇది ఆధిపత్య పోరుగా మారినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంగళవారం రాత్రి ఇసుక తవ్వకాలకు సంబంధించి తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు భరత్ సింగ్ నౌగెయిన్ గ్రామానికి వెళ్లారు. దీంతో అక్కడ వివాదం చెలరేగగా భరత్ సింగ్ ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారును కొందరు అడ్డగించారు. తప్పించుకునే వీలు లేకుండా కారుకు ముందు, వెనుక లారీలను అడ్డుపెట్టారు. ఆ తరువాత కారుపై పెట్రలో పోసి నిప్పటించడంతో భరత్ సింగ్ సజీవదహనమయ్యారు. అతనితోపాటు కారులో ఉన్న వీరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ కూడా కాలిన గాయాలతో కన్నుమూశారు. తీవ్రంగా గాయపడిన మయాంక్ సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబం డిమాండ్ చేసింది.ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని ఏఎస్పీ సురేషా చౌబే తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





