– పౌరసత్వం, నివాస ధృవీకరణ కోసం వాడొద్దు
– పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ
న్యూదిల్లీ ,జూన్ 18: ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డులను పౌరసత్వం, నివాసం ధ్రువీకరణకు ప్రూఫ్‌గా వాడుతున్నారని, దీన్ని ఐడెంటిటీ వెరిఫికేషన్‌కు మాత్రమే పరిమితం చేయాలని న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసం పిటిషన్‌ను విచారించింది. దీనిపై వెంటనే స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల”, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఆధార్‌ను ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా మాత్రమే వాడాలని పౌరసత్వం, నివాసం, అడ్రస్, పుట్టిన తేదీకి సంబంధించిన రుజువుగా వినియోగించకుండా కేంద్ర, రాష్ట్ర, ఎన్నికల సంఘాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఓటరు నమోదుకు బర్త్ డేట్, రెసిడెంట్ ఫ్రూఫ్‌లకు ఆధార్ కార్టును వినియోగిస్తున్నారని, ఇది ఆధార్Á చట్టానికి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 9 ’ఆధార్ పౌరసత్వానికి లేదా రెసిడెంట్‌కు ఫ్రూఫ్ కాదని ఉడాయ్ స్పష్టంగా తెలిపిందని, అయినప్పటికీ ఆధార్‌ను స్కూల్ అడ్మిషన్లు, ప్రాపర్టీ కొనుగోలు, బర్త్ ఫ్రూఫ్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు వయస్సు, పౌరసత్వం, నివాస ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించడమే కాక కొత్త ఓటరు నమోదుకు, పుట్టిన తేదీకి, నివాస ధ్రువీకరణ పత్రంగా కూడా వాడుతున్నారు. ఈవిధంగా చొరబాటుదారులు, అక్రమ వలసదారులు ఆధార్‌ను ఉపయోగించి వివిధ డాక్యుమెంట్లను పొందుతున్నారని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. ఎన్నికల పక్రియలలో ధ్రువీకరణ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని, సంస్కరణలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితోపాటు సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





