– ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో ముందుకు
– బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం
హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంస్కరణ కార్యక్రమాలు చేపడుతున్నామని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. 2023 డిసెంబర్ 3న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని నిల బెట్టుకునేలా ఐదు ప్రధాన రంగాలపై (విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సంక్షేమం) దృ ష్టి సారించి పాలన సాగిస్తున్నామని చెప్పారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖల ప్రగతి
మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) ద్వారా ఇప్పటివరకు సుమారు ₹12,075 కోట్ల విలువైన ఉచిత ప్రయాణ ప్ర యోజనం కల్పించినట్లు వివరించారు. రాష్ట్రం. లోని 580 మండలాలకు ఆర్టీసీ బస్సు సౌక ర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామ ని, మహిళా సంఘాలను ఆర్టీసీ బస్సుల నిర్వ హణలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. రవాణా శాఖలో వాహన సారథి, ఈవీ, స్క్రాప్ పాలసీలతో పాటు చెక్పోస్టుల రద్దు వంటి కీలక సంస్కరణలు తీసుకువచ్చినట్లు పేర్కొ న్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గురుకులా లు, హాస్టళ్లలో డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తు న్నా మని, కోహెడ, తంగళ్లపల్లి వంటి ప్రాం తాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల నిర్మాణం చేపడు తున్నామని చెప్పారు.
ఉద్యోగాల భర్తీ
రైతు సంక్షేమం: రైతు భరోసా కింద ₹36,000 కోట్లు, రుణమాఫీ కోసం రూ.20,000 కోట్లు, ధాన్యం కొనుగోళ్లకు రూ.35,000 కోట్లు వెచ్చించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. వెయ్యి రోజుల్లో 72,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. 16 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాం. ని యోజకవర్గానికి 5,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇం దిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.
మహిళా సాధికారత
మహిళా సంఘాలకు రూ.60.487 కోట్ల బ్యాంక్ లింకేజీ, రూ.1,900 కోట్ల వడ్డీ రాయి తీ అందించామని మంత్రి పొన్నం తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ ప్రక్రి య వేగంగా కొనసాగుతోందని, రైతుల సహ కారంతో కాలువల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం భూమి కూడా బీడుగా ఉండకూ డదన్నదే తన లక్ష్యమని, రైతులు ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గు చూపాలని సూచిం చారు. హుస్నాబాద్లో పరిశ్రమలు, పర్యాట కాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించామని మం త్రి తెలిపారు. ఎల్లమ్మచెరువు వద్ద అర్బన్ ఫారె స్ట్, యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ కాలేజ్, 200 పడకల ఆస్పత్రి, పీజీ కాలేజీ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కరీంనగర్, అక్కన్న పేట రహదారులను ఫోర్ లేన్లుగా అభివృద్ధి చేస్తున్నామని. ‘పల్లె పల్లెకు పొన్నమన్న.. పల్లె పల్లెలో ప్రజాపాలన’ ద్వారా ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




