– శ్రీరామ నామస్మరణతో మారుమోగిన పుణ్యక్షేత్రం
– భారీగా తరలివచ్చిన గిరిజనులు, మహిళలు
– సంప్రదాయ మేళతాళాలు, కొమ్ము డాన్సుల నడుమ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు
– హాజరైన ఎమ్మెల్యే వెంకటరావు, ఈవో దామోదర్ రావు
భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శబరి స్మృతి శోభా యాత్ర సోమవారం వైభవంగా జరిగింది. ఆలయం పురవీధులు, ప్రధాన రహదారుల మీదుగా శబరి విగ్రహం వద్దకు యాత్ర చేరుకుంది. భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకటరావు, దేవస్థానం ఈవో దామోదర్ రావు శబరిమాత విగ్రహానికి నూతన వస్త్రాలు ధరింపజేశారు. . ప్రధాన అర్చకులు శబరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరి గిరిజన మహిళ కావడంతో దేవస్థాన అధికారులు ఆదివారమే వివిధ గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా గిరిజన మహిళలను ఈ ఉత్సవానికి తీసుకువచ్చారు. ఇక్కడ బస ఏర్పాటు చేశారు. ఉదయాన్నే శబరి, శ్రీ సీతారామచంద్రస్వామి చిత్రవటాలకు, విగ్రహానికి గిరిజన మహిళలు పూజలు నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, కొమ్ము డాన్సులతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. అనంతరం గిరిజనులు వారివారి గ్రామాల నుంచి స్వయంగా తీసుకొచ్చిన వండ్లను తలపై ఉంచి శబరి, శ్రీరామచంద్రమూర్తి చిత్రపటాన్ని తోడుకొని వచ్చి శ్రీరామ కల్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. 
అర్చకులు ఉత్సవ మూర్తులను గిరిజనుల ఎదుట ఆశీనులు గావించి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. శ్రీరామచంద్రుడు శబరి ఇచ్చిన ఎంగిలి పండు తినటం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని గిరిజనులకు వివరించారు. రాముల వారి రాక కోసం 13 సంవ త్సరాలపాటు అనునిత్యం తపిస్తూ రామ నామాన్ని జపిస్తూ నిరీక్షించిందని వురాణాలు చెవుతున్నాయని అర్చకులు తెలిపారు. కార్యక్రమానికి కావల్సిన పది రకాల పుష్పాలు, 12 రకాల పండ్లను వివిధ గ్రామాల నుంచి గిరిజన మహిళలు తీసుకొచ్చారు.. కార్యక్రమంలో సర్పంచ్ పూనెం క్రిష్ణదొర, దేవస్థానం జేఈవో శ్రావణ్ కుమార్, గిరిజన నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





