సిరిసిల్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల ద్వారా దాదాపు రూ.30 లక్షల విలువైన వైద్య పరికరాలు సమకూరాయి. ఈ పరికరాలను ఆయన సోమవారం ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దవాఖానకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేటీఆర్ ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల దవాఖానలో వైద్య సదుపాయాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల నిర్వహణ, గతంలో కల్పించిన సదుపాయాల పరిరక్షణపై నిర్లక్ష్యం చూపుతోంది. ఈ నేపథ్యంలో హాస్సిటల్‌కు వచ్చే రోగుల అవసరాలను గుర్తించి సీఎస్ఆర్ నిధుల ద్వారా సుమారు రూ.30 లక్షల విలువైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైద్య పరికరాలను సమర్థవంతంగా వినియోగిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని స్థానికులు ఆశిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





