ప్రయాణికులకు ఆర్టీసీ ఆఫర్

– రిటర్న్ టిక్కెట్ బుకింగ్‌పై 10 శాతం రాయితీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు ఆర్ధిక భారాన్ని తగ్గించడంతోపాటు ముందస్తు రిజర్వేషన్‌ను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తమ రాకపోకల టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవడం ద్వారా తిరుగు ప్రయాణం టికెట్‌పై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దూరప్రాంతాలకు ప్రయాణించే వారికి, అలాగే వారాంతాల్లో కుటుంబంతో కలిసే వెళ్లేవారికి ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సంస్థ ఈ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ను పొందడానికి ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ఉపయోగించి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవలసి ఉంటుంది. వెళ్లేందుకు, తిరిగి రావడానికి ఒకేసారి టికెట్లను రిజర్వ్ చేసినప్పుడు మాత్రమే వర్తించే ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణ ఖర్చులపై ఆదా చేసుకోవచ్చు. ప్రయాణ తేదీలను ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి సీట్ల లభ్యత సమస్య లేకుండా, తక్కువ ధరలోనే టికెట్ దొరికే సౌకర్యం కలుగుతుంది. టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన సందేహాల నివారణకు లేదా సమాచారం కోసం సంస్థ హెల్ప్‌లైన్ నంబర్లు 040-69440000, 040-23450033 లను కూడా అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ వాహన ప్రయాణాల కన్నా భద్రత, సౌకర్యం అధికంగా ఉండే ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. రాబోయే పండుగలు, సెలవుల సీజన్‌లో ప్రయాణించే వారు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఈ ముందస్తు బుకింగ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రజా రవాణాను మరింతమందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *