పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

– 15 మందికి గాయాలు, 8 మంది పరిస్థితి విషమం

వనపర్తి, ప్రజాతంత్ర, జూన్ 29: మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్‌ బస్సు సోమవారం ఉదయం పెబ్బేరు సమీపంలోని జాతీయ రహదారి (ఎన్ హెచ్-44)పై అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో ఎనిమిది మంది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగా త్రులను పెబ్బేరు, వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రి, సరోజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడంతోపాటు, అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *