దుబ్బాకలో కేజీ బంగారం, నగదు అపహరణ

– కాశీ యాత్రకు వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగలు
– కిటికీ ఊచలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశం
– సంఘటన స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట ప్రజాతంత్ర, జూన్ 29: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 15వ వార్డులో గల ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి సుమారు కేజీ బంగారంతో పాటు నగదును అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.స్థానికుల కథనం ప్రకారం, మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు చింత రాజ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తొమ్మిది రోజుల క్రితం కాశీ యాత్రకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న దుండగులు ఇంటి కిటికీ ఊచలను విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. పడక గదిలోని లాకర్‌ను పగులగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన బంగారం కేజీ వరకు ఉంటుందని ప్రాథమిక సమాచారం. సోమవారం ఉదయం ఇంటి ఆవరణను శుభ్రం చేసేందుకు వచ్చిన పని మనిషి మంజుల ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి యజమానికి సమాచారం అందించింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై కీర్తిరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ఏ, సీఐ రవీందర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తును పర్యవేక్షించారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *