షాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నాగర్‌గూడ టీ పాయింట్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని దాదాపు 13.97 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలతోపాటు మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడిన వారిని శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన మారం వంశీరెడ్డి(23), వీర ప్రవీణ్ కుమార్ (28)గా గుర్తించారు. వీరు వృత్తిరీత్యా పెయింటింగ్ పనులు చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో బెంగళూరు నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. వీటిని మోకిల, కోకాపేట పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ,యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




