బాబా అవతారంలో రౌడీ షీటర్‌

-‌ వలపన్ని పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14:  హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్‌ ‌జావేద్‌ అనే వ్యక్తి 2018లో సైఫాబాద్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ వ్యక్తిని రౌడీషీటర్‌ ‌హత్య చేశాడు. ఆపై పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు 2020 ఆగస్టులో జావేద్‌పై నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేశారు. అప్పటి నుంచి జావేద్‌ ‌కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పోలీసుల కళ్లుగప్పి సంగారెడ్డి జిల్లా చేర్యాలలో జావేద్‌ బాబా అవతారం ఎత్తాడు. ఓ ‌దర్గాలో బాబాగా చలామణి అవుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఖైరతాబాద్‌ ‌జోన్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని చాకచక్యంగా జావేద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడికి డ్రగ్స్ ‌పరీక్షలు నిర్వహించగా గంజా సేవించినట్లు నిర్దారించారు. మరోవైపు రౌడీషీటర్‌ ‌వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం మహ్మద్‌ ‌జావేద్‌ను సైఫాబాద్‌ ‌పోలీసులకు టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు అప్పగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *