ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలి

– ఎల్‌నినో దృష్ట్యా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచన

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని, కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సూచనలు చేశారు. వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జý, భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు సమన్వయంతో భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని, శాస్త్రవేత్తలు సూచించినట్లు తక్కువ కాలంలో పండే, తక్కువ నీరు అవసరమయ్యే అధిక దిగుబడి పంట రకాలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ మాట్లాడుతూ కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల సాగును పెంచాలని రైతులకు సూచించారు. ఐఎండీ హైదరాబాద్ సంచాలకురాలు స్టెల్లా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వచ్చే మూడు నెలల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉండటంతో కృష్ణా, గోదావరు.ల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉన్నందున వరి, చెరకు వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ సంచాలకుడు బి.గోపి, సహకార శాఖ ప్రత్యేక సంచాలకుగు రాహుల్ రాజ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్తాస్ జానయ్య, ఇరిగేష‌న్‌ ఇంజినీర్-ఇన్-చీఫ్ మధుసూదన్ రావు, భూగర్భ జలాల శాఖ సంచాలకుడు లక్ష్మణ్, భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యవతి, ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి, భారత నూనెగింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ సురేష్, మెట్ట పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కె.వి.రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ మహాదేవప్ప పాల్గొన్నారు. ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులు రైతులకు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పంటల నిర్వహణ, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై పలు సూచనలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *