– ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక అడుగుపడింది. నగరంలో మరో ఆర్‌వోబీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచఎంసీ రూ.71 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 490 మీటర్ల పొడవుతో నాలుగు లేన్లలో ఫ్లై ఓవర్‌ను జీహెచఎంసీ నిర్మించింది. జీహెచఎంసీ, సౌత్ సెంట్రల్ రైల్వేల సమన్వయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. శాస్త్రిపురం ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమా మార్గంలో ప్రయాణం సులభతరం అయింది. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమాకు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఉద్దమ్‌గడ్డ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ జామ్‌కు చెక్ పడనుంది. ప్రయాణ సమయం కూడా చాలావరకు తగ్గనుంది. ఈఫ్లె ఓవర్ ద్వారా మైలార్‌దేవ్‌పల్లి, వట్‌పల్లి, ఫలక్‌నుమా, ఆర్టీసీ బస్ డిపో ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





