న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా న్యూదిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. భారÔ దేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా సేవలందించారన్నారు. భారత దేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





