– బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే అలా మాట్లాడితే ఎలా?
– హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29: వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ 30 శాతం లోటు వర్ష పాతం నమోదైందని, 150 ఏళ్ల నుంచి చూడని ప్రకృతి వైపరీత్యం వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కూడా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాన్ని గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేస్తున్నామని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. రైతులు మెట్ట పంటలు వేస్తున్నారని, ఆయిల్ పామ్ వైపు ఎక్కువమంది రైతులు మొగ్గుచూపుతున్నారని, ఇది మంచి శుభపరిణామమని అన్నారు. హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామనడం అర్థం లేదంటూ సెటైర్ విసిరారు. కాగా, గాంధీ భవన్‌ను దేవాలయంగా భావించి నమ్మకంతో ప్రజలు సమస్యలు చెప్ప్పుకోవడానికి వస్తున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని తెలిపారు. ఏ పార్టీ నిర్వహించని ముఖాముఖిని కాంగ్రెస్ నిర్వహిస్తోందన్నారు. కలెక్టర్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తూ నివేదిక అడుగుతున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





