క్షతగాత్రుల ప్రాణాలు కాపాడితే పారితోషికం

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  
– ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్‌ పాటించాలి
– కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లో బాధితులను హాస్పిటల్‌కు తరలించి వారి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల పారితోషకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాగోల్‌లోని ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నపాటి నిర్లక్ష్యాలు, పొరపాట్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమేకాక జీవితాంతం అచేతన స్థితికి పరిమితమైనవారూ ఉన్నారని అన్నారు. ఈ ప్రమాదాల వల్ల వీరేకాÅ£ వీరి కుటుంబాలు కూడా రోడ్డున పడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాయన్నారు. అందుకే ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని మంత్రి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో ప్రతి వారం ఒక థీమ్ తీసుకొని దానిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ వారం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీసు, రవాణా, రెవెన్యూ ఇతర శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నామన్నారు. అనేక కారణాలవల్ల ప్రతిరోజూ 400 నుండి 500 వరకు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించి అక్కడ నివారణ చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా ప్రమాదాలను కొంతవరకు నివారించగలమని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో స్కూల్ పిల్లలకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించి వారి ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నామన్నారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ భద్రంగా గమ్యం చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో కీసర ఆర్డీవో రాజేష్ కుమార్, ఉప్పల్ తహసిల్దార్ పూల్ సింగ్ చౌహన్, ఉప్పల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు అశ్విని, ఎ.వీరేంద్రసాయి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *