దేశంలో అలజడులకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కుట్ర

బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : దేశంలో అశాంతిని సృష్టించి యువతను రెచ్చగొట్టడం ద్వారా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో భారత దేశంలో కూడా అశాంతిని, హింసను సృష్టించేందుకు కొన్ని అల్ట్రా-లెఫ్ట్, సాఫ్ట్-లెఫ్ట్ శక్తులు, ఎసఎఫఐ, ఏఐఎసఎఫ్, ఏఎసఏ వంటి పాత సంఘాల నాయకులు కొత్త పేర్లతో కాక్రోచ్ జనతా పార్టీ వంటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల వెనుక ఈ శక్తుల హస్తం ఉందన్నారు. ఈ ఉద్యమాలకు ఖలిస్తాన్ శక్తుల నుంచి రూ.10 కోట్లు, కతార్, కెనడా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి ఆర్థిక, వ్యూహాత్మక మద్దతు అందుతోందని ఆరోపించారు. ఏ ఖలిస్తానీ శక్తులైతే రాహుల్ గాంధీ నానమ్మను పొట్టనబెట్టుకున్నాయో అదే శక్తులతో రాహుల్ గాంధీ జతకట్టడం సిగ్గుచేటని విమర్శించారు.‘నీట’ మోదీ ప్రభుత్వ పారదర్శక చర్యలు‘నీట’ పేపర్ లీకేజీపై రామచందర్‌రావు మాట్లాడుతూ లీకేజీ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించి 31 మందిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ అనుకూల వ్యక్తులే ఈ లీకేజీకి కారణమని తేలిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని, ఏ ఒక్క విద్యార్థి కూడా దీనిపై రోడ్డు మీదకొచ్చి నిరసన తెలపలేదని ఆయన అన్నారు. గతంలో పరీక్షల పేపర్ లీక్ అయితే 420 కేసులు పెట్టి వదిలేసేవారని, కానీ మోదీ ప్రభుత్వం 2024లో ప్రివెన్షన్ ఆఫ్ అన్-ఫెయిర్ మీన్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ తీసుకొచ్చి రూ.కోటి జరిమానాతోపాటు కఠిన శిక్షలు అమలులోకి తెచ్చిందని చెప్పారు. ప్రొఫెసర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని బలోపేతం చేసి సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు.యÖపీఏ పాలనలోనే రికార్డు స్థాయి లీకేజీలువిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ శక్తులు తమ గత చరిత్రను గుర్తు చేసుకోవాలని రామచందర్‌రావు హితవు పలికారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు(టీఎంసి, డీఎంకే, ఎస్పీ, బీఆరఎస్ మొదలైనవి) పాలించిన రాష్ట్రాల్లో సుమారు 53కంటే ఎక్కువ ప్రధాన పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని వివరించారు.

2005 నుండి 2014 వరకు సీబీఎసఈ, ఎయిమ్స్, ఆరఆర్‌బీ, ఎసఎస్సీ, బ్యాంకింగ్ వంటి అనేక జాతీయస్థాయి పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆధారాలు చూపారు. ఆ సమయంలో ఏనాడైనా కాంగ్రెస్ లేదా నాన్-బీజేపీ ప్రభుత్వాల విద్యాశాఖ మంత్రులు రాజీనామాలు చేశారా అని ఆయన ప్రశ్నించారు.ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో ఎన్డీయే కొత్త చరిత్ర2004-2014 మధ్య యÖపీ¾ఏ ప్రభుత్వం 2.9 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే 2014-2024 మధ్య మోదీ ప్రభుత్వం 17 కోట్ల ఉద్యోగ అవకాశాలను సృష్టించిందన్నారు. ఎన్డీయే పాలనలో ఇప్పటివరకు 12 లక్షలకు పైగా నియామక పత్రాలు అందజేశామని, 19 రోజ్‌గార్ మేళాల ద్వారా నిరంతరం నియామకాలు జరుగుతున్నాయని రామచందర్‌రావు తెలిపారు. 2017-18లో 6%గా ఉన్న నిరుద్యోగిత రేటు 2025 నాటికి 3.1%కి తగ్గిందని, ఎంప్లాయ్‌మెంట్ రేటు 46.8% నుండి 57.4%కి పెరిగిందని వెల్లడించారు. 2014 తర్వాత ఐఐటీ, ఐఐఎమ్, ఎయిమ్స్, ఎనఐటీ, మెడికల్ కళాశాలల సంఖ్యను రెట్టింపు చేశామని, ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు 4.5 కోట్లకుపైగా పెరిగిందని వివరించారు. వికసిత్ భారత్, ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా ద్వారా కోట్లాది మంది యువతకు స్వయం ఉపాధి లభించిందన్నారు.

తెలంగాణ యువత దేశానికే కొండంత అండముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దేశ వ్యతిరేక శక్తులకు, విదేశీ నిధులతో నడిచే సంఘాలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో జరిగిన పరిణామాలను ఇక్కడ పునరావృతం చేయాలని చూస్తే భారతీయ యువత చూస్తూ ఊరుకోదని, వారంతా దేశ భక్తితో ప్రధాని మోదీ నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతారని స్పష్టం చేశారు

.మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మృతికి సంతాపం

బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి మృతి పట్ల రామచందర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వర్గస్థులయ్యారనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు, చూపిన నిబద్ధత ఎనలేనివన్నారు. జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీ ఎదుగుదలకు ఆయన పడిన శ్రమ ఎంతో ప్రశంసనీయమన్నారు. వారి అకాల మరణం పార్టీకి, బీజేపీ జిల్లా కుటుంబానికి తీరని లోటని అంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషు లకు తన తరఫున, పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *