కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి

గౌరవ సభ కాదు..  కౌరవ సభ
రాష్ట్రంలో పాలన గాడితప్పింది
కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాలి
రాష్ట్రపతి పాలన విధించాలి
కేసీఆర్ ఇంటిపై దాడి వికృత చర్య
రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి
బీఆర్ఎస్ ఎల్పీ  డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలపై సోమవారం దాడి జరిగితే ఎందుకు చర్చ చేయడం లేదు… ఎందుకు మహిళా ఎమ్మెల్యేలకు మైకులు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఆనాడు ద్రౌపది పట్ల వ్యవహరించిన తీరు గుర్తు చేస్తున్నదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పుకోవడానికి అసెంబ్లీలో వారికి అవకాశంగా ఇవ్వడం లేదంటూ గౌరవ సభను రేవంత్‌రెడ్డి కౌరవ సభగా చేశాని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరగలేదని స్పీకర్ ఎలా అంటారు అంటూ యావత్ దేశం చూసింది.. మీడియాలో వచ్చింది అన్నారు. ఫిర్యాదు ఇస్తే నమోదు కాలేదు.. దాడి జరిగిన సునీతమ్మ, సబితమ్మ, కోవా లక్ష్మిపై ఉల్టా కేసు పెట్టారు అని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం అంటే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటె అన్నట్లేనన్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నడన్నారు. బీఆర్ఎ స్ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు నులిమి అరెస్టులు చేసి రేవంత్ వికృతానందం పొందుతున్నడన్నారు. స్పీకర్ మీద కావాలని అనలేదంటూ అయినా అందుకు మధు క్షమాపణలు చెప్పారన్నారు. బీజేపీ వాళ్లు ప్లకార్డులు తీసుకు వెళ్తే అడ్డుకోరు.. తాము టీ షర్టులు వేసుకుంటే అడ్డుకుంటరు.. బీజేపీ, కాంగ్రెస్ బంధం ఇదే కదా అని నిలదీశారు. బడివే అని, తంతం అని అసెంబ్లీబ్లో అంటే అది వికృత భాష కాదా ప్రశ్నించారు. తాము ఆరు గ్యారెంటీల గురించి అడిగితే వికృత భాషనట.. మొన్న పాలిటిటక్నిక్ విద్యార్థుల గొంతు నులిమారు.. నిన్న సబితమ్మ గొంతు పట్టుకున్నారు.. నేడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఇంటిపైకి దాదికి ఉసిగొల్పారు అని ఆరోపించారు. రోప్ పార్టీ ఇచ్చి, ఎస్కార్ట్ ఇచ్చి దగ్గరుండి దాడికి ప్రోత్సహించారన్నారు. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగినదానికి క్షమాపణ చెప్పాలి.. ప్రపతిక్ష నాయకుడి ఇంటిపై దాడి జరిగిందానికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో లేదు.. అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయి అని మండిపడ్డారు. నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని గవర్నర్‌ను కోరుతున్నామని హరీష్‌రావు చెప్పారు. రాహుల్ గాంధీ.. మీరు ఎందుకు మాట్లాడటం లేదు.. లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకుని గూండాల్లాగా ప్రవర్తిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని చేతులో పట్టుకుని ఉండే నువ్వు ఇక్కడ జరుగుతున్న రాజ్యాంగ భక్షణ కనిపించడం లేదా అని నిలదీశారు. కేటీఆర్, యాదవ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సంజయ్, నాకు అందరికీ దెబ్బలు తాకాయి.. తాము పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే తీసుకోివడం లేదు.. చేతులో అధికారం ఉందని, మందబలం ఉందని ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే కౌరవులకు పట్టిన పరిస్థితే మీకు ఉంటుంది అని హరీష్‌రావు హెచ్చరించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్ చావాలని అనడం దారుణమన్నారు. వెంటనే ఆయనపై తీర్మానం పెట్టి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సభలో ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానం ప్రతిపక్ష నాయకుడిది. అలాంటి నాయకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు అని స్పీకర్‌ను అడిగారు. ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. 119మంది ఎమ్మెల్యేలను సమానంగా చూడాలి కానీ ఎందుకు ఏపక్షంగా వ్యవహరిస్తున్నారని అడిగారు. రెండు రోజులు ప్రజల సమస్యలపై చర్చ లేకుండా సభా సమయాన్ని వృథా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదని, ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటాం.. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం అని ఆయన హెచ్చరించారు. సభలో చర్చ జరిగితే వైఫల్యాలు బయట పడుతాయని చర్చ జరగకుండా ప్లాన్ చేసిండు అన్నారు.ఈ చేతగాని దద్దమ్మ సీఎం వల్ల ఇక్కడ క్రాప్ హాలిడే

యూరియా యాపులు పెట్టి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు.. నీళ్ల్లు లేక పంటలు ఎండుతున్నాయి.. కరెంట్ ఇవ్వలేక చేతులు ఎత్తుతున్నారు.. కేసీఆర్ పాలనలో ఈ సమస్యలు లేవు.. మీరు రాగానే ఎందుకు మొదలయ్యాయి అని హరీష్‌రావు ప్రశ్నించారు. విద్యార్థులు పీజు రీయింబర్స్‌మెంట్ కోసం, ఉద్యోగులు పీఆర్సీ, డీఏ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కరోనా ఉన్నా పెద్ద నోట్ల రద్దు ఉన్నాక కేసీఆర్ రూ.20వేల కోట్ల పీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేశారు అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని, 22ఎ పెట్టి రాత్రికి రాత్రి పేదల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల గుండెపై బండ వేశారని అన్నారు. నాలుగు వేల పింఛన్ ఏమైంది..  పెంచుతానన్న రైతు భరోసా ఏది అని రైతులు ఆడుగుతున్నారు.. వెయ్యి రోజులు అయినా నీ ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు.. బకాయిలతో సహా చెల్లించాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

హకీంపేట్ వద్ద హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేల అరెస్ట్ 
– కేసీఆర్‌కు రక్షణగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలపై నిర్బంధం
– జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు 

కేసీఆర్‌కి రక్షణగా వెళ్తున్న తమను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు పీకలదాకా తాగి కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్తున్న కాంగ్రెస్ గూండాలకు, ఎమ్మెల్యేలకు మాత్రం పైలట్ ఎస్కార్ట్ ఇచ్చి మరీ పంపుతున్నారు.. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని బీఆ ర్ఎస్ నేత హరీష్‌రావు అడిగారు. కేసీఆర్ ఫాంహౌస్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి వెళ్తున్నారన్న సమాచారంతో ఆయనకు రక్షణగా వెళ్తున్న బీఆ ర్  ఎస్ నేతలు హరీష్‌రావు, కేటీఆర్ తదితరులను మేడ్చల్ మల్కాజిగిరి కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు హకీంపేట వద్ద హరీష్‌రావు, ఇతర ఎమ్మెల్యేలను అరెస్టు చేసి జవహర్‌నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ విలేకరులతో హరీష్‌రావు మాట్లాడారు. నిన్నటికి నిన్న మహిళా ఎమ్మెల్యేల గొంతులు పిసికి, చీరలు లాగిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈరోజు తెలంగాణ సాధించిన నాయకుడు, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపైకే దాడికి పంపింది.. స్వయంగా హోంమంత్రి శాఖను కూడా తన చేతిలోనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే దగ్గరుండి ఈ దాడి చేయిస్తున్నారు అని హరీష్‌రావు ఆరోపించారు. రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకుని తిరుగుతూ ప్రజాస్వామ్యం గురించి పోజులు కొట్టే రాహుల్ గాంధీని నేను సూటిగా అడుగుతున్నాను.. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యలను, దాడులను సమర్థిస్తావా.. మీరు ప్రజలకు ఇచ్చిన ఏడవ గ్యారెంటీ ఇదేనా రాహుల్ గాంధీ అని ప్రశ్నించారు. ఆనాడు అస్సాం ముఖ్యమంత్రి నీ పుట్టుకను ప్రశ్నిస్తే మీ పార్టీ ముఖ్యమంత్రులు సైతం నోరు మెదపలేదు. కానీ నాడు నీకు మానవత్వంతో, నిజాయతీగా మద్దతుగా నిలబడింది కేసీఆర్. ఆరోజు నీకు అండగా నిలబడినందుకు ఇవాళ కేసీఆర్ ఇంటి మీదకే గూండాలను పంపుతావా? నీకు నిజంగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, నువ్వు మాట్లాడే మాటల్లో కొద్దిపాటి నిజాయతీ ఉన్నా తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకో అని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్.. కేసీఆర్ చావాలి, కేసీఆర్ చావును మేం కోరుకుంటున్నాం అని పబ్లిక్‌గా అన్నాడంటే అది శంకర్ మాట కాదు.. ముమ్మాటికీ రేవంత్ రెడ్డి మాటే.. రేవంత్ రెడ్డి ప్రతిరోజూ కేసీఆర్ చావును కోరుకుంటున్నాడు.. తన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ని తిట్టిస్తున్నాడు.. దాడులు చేయిస్తున్నాడు.  రేవంత్ రెడ్డి.. అసలు నువ్వు కూర్చున్న ఆ ముఖ్యమంత్రి కుర్చీ కేసీఆర్ పెట్టిన భిక్ష. కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడి తెలంగాణ సాధించకపోతే ఇవాళ నీకు ఈ ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది అని వ్యాఖ్యానించారు. ఈరోజు పోలీసుల రక్షణలో కాంగ్రెస్ గూండాలు, ఎమ్మెల్యేలు కేసీఆర్ ఇంటిపై చేసిన ఈ దాడిని తెలంగాణ సమాజం, బీఆర్ ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని హరీష్‌రావు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *