ఎర్రవల్లిలో హైటెన్షన్

– కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల బాహాబాహీ

– దామరకుంట వద్ద రాళ్ల దాడి, తోపులాట
– కేటీఆర్, హరీశ్ రావు ఎర్రవల్లి బాట
– మార్గమధ్యలో పోలీసుల అరెస్ట్, భారీ బందోబస్తు

సిద్దిపేట, ప్రజాతంత్ర సెప్టెంబర్ 8: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి, దామరకుంట ప్రాంతాలు మంగళవారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు కేంద్రంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు చేపట్టిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీ సింది. కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ కార్యక ర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై రాళ్ల దాడి కూడా జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెద రగొట్టారు. శాసనసభ స్పీకర్ గడ్డం “ప్రసాద్కు మార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లు తీవ్ర పదజా లంతో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ‘వెయ్యి డప్పులతో’ ఫామ్స్ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావడంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఎర్ర పల్లి వైపు కదిలే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకే ప్రాంతంలో ఇరు పార్టీల కార్యక్రమాలు జరగనున్న నేపథ్యం లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లి వైపు కదులుతున్న సమయంలో దామరకుంట వద్ద బీఆర్ఎస్ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

కాంగ్రెస్ కాన్వాయ్ పై రాళ్ల దాడి 

జరిగినట్లు సమాచారం. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాల మధ్యకు వచ్చి వారిని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయ త్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. కాంగ్రెస్ ముట్టడి పిలుపుతో ఎర్రవల్లి పరిస రాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫామహౌస్కు వెళ్లే ప్రధాన రహదారుల్లో బారికే డ్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేపట్టారు. ఫామ్ హౌస్ చుట్టుపక్కల 144 సెక్షన్ అమలు చేసి, అదనపు పోలీసు బలగా లను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎర్రవల్లి వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేం దుకు పోలీసు బలగాలను మోహరించారు. అవస రమైతే ఆందోళనకారులను అదుపులోకి తీసుకు నేందుకు డిటెన్షన్ వాహనాలను కూడా సిద్ధంగా చేశారు. దామరకుంటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలుసు కున్న వెంటనే బీఆర్ఎస్ అగ్రనేతలు ఎర్రవల్లి వైపు కదిలారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ నుంచి నేరుగా ఎర్రవల్లి వైపు బయలుదేరిన వారి వాహనా లను పోలీసులు బొల్లారం-హకీంపేట ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం. వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత నివాసానికి వెళ్లడాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నిస్తూ నేతలు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు కేటీఆర్, హరీశ్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. హరీశ్రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషను, కేటీఆర్ ను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను కూడా వివిధ ప్రాంతాల్లో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల కదలికలను కూడా పోలీసులు నియంత్రించారు. ఉదయం నుంచే ఎర్రవల్లిఫామ్ హౌస్ పరిసరాలు పోలీసుల ఆధీనంలోకి వెళ్లినట్లు కనిపించింది. ప్రధాన రహదారుల వద్ద చెక్  పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేసి అనుమానాస్పద కదలికలను నియంత్రించారు. ఫామ్ హౌస్‌  వైపు వెళ్లే మార్గాల్లో పోలీసు బలగాలను మోహరించారు.  

కాంగ్రెస్ కార్యకర్తలు ఫామ్ హౌస్ సమీపానికి చేరకుండా పోలీసులు అడ్డుకోవడం, మరోవైపు బీఆర్ఎస్ నాయకులు తమ అధినేత ఫామ్ హౌస్ వద్దకు చేరేందుకు ప్రయత్నించడం వల్ల భద్రతా చర్యలు మరింత కఠినతరం అయ్యాయి. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో గజ్వేల్, ఎర్రవల్లి ప్రాంతా లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. బీఆర్ఎస్ అధినేత రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే సంద ర్భాల్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ ప్రాధాన్యం సంతరిం చుకున్న విషయం తెలిసిందే. అలాంటి ప్రాంతంలో నే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు భారీ నిరసనకు దిగడం, వారిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతలు స్వయంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. మంగళవారం జరిగిన పరిణామాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు ఇకపై కేవలం అసెంబ్లీ వేదికకే పరిమితం కాదనే సంకేతాలను ఇచ్చాయి. మొత్తంగా చూస్తే మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, దామరకుంట ప్రాంతాలు రాజకీయాల్లో హాట్ స్పాట్‌గా మారాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నం, బీఆర్ఎస్ శ్రేణుల ప్రతిఘటన, రాళ్ల దాడి తోపులాట, కేటీఆర్-హరీశ్రావుల ఎర్రవల్లి ప్రయాణం, పోలీసుల అడ్డగింత- అరెస్థులు, 144 సెక్షన్ అమలు, భారీ బందోబస్తు.. ఇలా వరుస పరిణామాలతో సిద్దిపేట జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పు రావడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *