– అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయి పోరు
– ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ముట్టడితో పెరిగిన ఉద్రిక్తతలు
– ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ముట్టడితో పెరిగిన ఉద్రిక్తతలు
“కేసీఆర్ లాంటి తెలంగాణ టవరింగ్ పర్సన్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు అంటే ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పక్ష నేత చావు కోరుకుంటున్న డప్పు కొట్టడం దళితవాదం అనిపించుకోదు. మూర్ఖత్వం అవుతుంది. ఏ దళితుడు ఒక వ్యక్తి చావు కోరుకోడు. ఒకరకంగా దళితులను అధికారాన్ని నిలుపుకునే అగ్ర దళిత నేతలు ఆడుతున్న చదరంగంలో పేద మధ్యతరగతి దళితులను పావుగా మార్చుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి చావును కోరుకోవడం నేరం. అలాంటిది కేసీఆర్ చావు కోరుకుంటున్నాం అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం..”
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
రాష్ట్ర రాజకీయమంతా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చుట్టూ తిరుగుతున్నది. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఓటమిపాలైనప్పటినుండి ఆయన ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కే పరిమితమైనప్పటికీ ఆయన ప్రస్తావన లేకుండా రాజకీయాలు సాగడంలేదు. కెసిఆర్ పేరును శాశ్వతంగా తుడిచివేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ రెండున్నర ఏండ్లలో ఆయన పాల్గొన్న ఏ సమావేశంలోనైనా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పేరును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉచ్చ రించకుండా ఉపన్యసించలే పోతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని కెసిఆర్‌కు శాసనసభ్యుడిగా ఉండే అర్హతలేదని తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన విమర్శ రాజకీయ వర్గాల్లోనే కాక సామాన్య ప్రజల్లో కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. అంతటితోనే ఆగకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో కెసిఆర్‌కు చెల్లించిన వేతనం అణాపైసలతో లెక్కకట్టి చెప్పిన రేవంత్‌రెడ్డి, కెసిఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆ మేరకు ఓ కార్యక్రమాన్నికూడా చేపట్టారు. వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలు ఆ పార్టీ నాయకులంతా చాలాకాలంగా చేస్తున్న ఆరోపణే అయినప్పటికీ ఇంతవరకు మాటలకే పరిమితమైన అధికార పార్టీ ఇప్పుడు చేతలకు దిగడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా జరిగిన పెద్ద గందరగోళం అటుతిరిగి ఇటుతిరిగి మళ్ళీ కెసిఆర్ వైపుకే మళ్ళింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నల్లదుస్తులపై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభలోకి రావడానికి ప్రయత్నించిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు, ఎంఎల్సీలను పోలీసులు అడ్డుకున్న సందర్భంలో ఎంఎల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలు స్పీకర్‌పైన, పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. వారిద్దరి సభ్యత్వాలను రద్దుచేయడంతో పాటు, పార్టీ అధినేత కెసిఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పట్టుపట్టింది. బిఆర్‌ఎస్ సభ్యులు మినహా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంగళవారంనాటి సభలో పాల్గొన్న అన్ని పార్టీలు ఇదే విషయాన్ని శాసనసభలో వ్యక్తం చేశాయి. కాగా, కాంగ్రెస్ ఎస్సీ సెల్ దీన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. ఎస్సీ వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను నిందించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ కెసిఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కెసిఆర్ నివాసం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవైపు అసెంబ్లీ రెండవ రోజు సమావేశం జరుగుతుండగానే ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌ను కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు కొందరి నాయకత్వంలో ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఎర్రవెల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వేల సంఖ్యలో అక్కడికి తరలడం, బిఆర్‌ఎస్ శ్రేణులుకూడా ఫామ్‌హౌజ్‌కు చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో ఎర్రవెల్లి ప్రాంతంలో 144 సెక్షన్ పెట్టిన పోలీసులు సుమారు వెయ్యి మంది సిబ్బందిని అక్కడ మోహరించారు. కాగా ఎస్సీ కార్యకర్తలు అక్కడ చావుడప్పు మోగించి కెసిఆర్‌కు తమ నిరసన వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే తమ అధినాయకుడిపై కాంగ్రెస్ దాడికి చేస్తున్న క్రమంలో ఫామ్ హౌజ్‌లోని తమ అధినాయకుడికి అండగా ఉండాలని బయలుదేరిన బిఆర్‌ఎస్ నాయకులు కెటిఆర్, హరీష్‌రావు, శ్రీనివాస యాదవ్‌లతోపాటు మరికొందరు నాయకులను దారి మధ్యలోనే పోలీసులు అరెస్టుచేయడంతో బిఆర్‌ఎస్ శ్రేణులు బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లోకి దూసుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత కెసిఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు ఒకటిరెండు సార్లు తప్ప హాజరు కాలేదు. ఎంఎల్‌ఏగా ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో పాల్గొన్నారు. గతంలో తనను జైల్‌పాలుచేసిన కెసిఆర్‌పై తీవ్ర ఆగ్రహంతోఉన్న సిఎం రేవంత్‌రెడ్డి ఎట్టిపరిస్థితిలో కెసిఆర్‌ను జైలు ఊచలు లెక్కపెట్టీయాలన్న పట్టుదలగా ఉన్నారు. అంతేగాక కెసిఆర్ పేరును, పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న లక్ష్యంగా ప్రతీ చర్యలో ఆయన తప్పిదాలను బయటపెట్టి ప్రజల్లో నిందితుడిగా ముద్రవేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అనేక రకాలుగా దూషించడం, తేలిగ్గా మాట్లాడటం, ముఖ్యంగా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజీ వాడటం ద్వారా కెసిఆర్‌ను రెచ్చగొట్టి ఫామ్‌హైజ్‌నుంచి బయటికి రప్పించాలని రేవంత్‌రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చర్యలద్వారా అర్థమవుతున్నది. ప్రజాధనాన్ని వేతన రూపంలో తీసుకుంటూ ప్రజాసమస్యను పట్టించుకోని కెసిఆర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామాచేయాలంటూ ఇటీవల డిమాండ్ చేయడం ప్రారంభించారు. కెసిఆర్ పదేళ్ళకాలంలో అభివృద్ధి పేరుతో తెలంగాణలో విద్వంసం చేశారని, చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులన్నీ అవినీతిమయమైనాయంటూ కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటినుండీ ఆరోపిస్తూనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీటిని నిత్యం చెర్వితచరణంగా ప్రజలు మరిచిపోకుండా నిత్యం వల్లెవేస్తూనే ఉన్నారు. ఆ ఆరోపణలు ఒకఎత్తు అయితే కెసిఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని తీసుకుని రాజీనామాచేయాలన్న డిమాండ్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారడం మరో ఎత్తుగా నిలిచింది.
ఇదిలాఉంటే కెసిఆర్‌ను అసెంబ్లీ వేదికగా అవమానించడానికే రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి రావాలంటూ పట్టుపడుతున్నాడని, ఆయన వాడుతున్న భాష కెసిఆర్ ఆత్మగౌరవాన్ని కించపర్చేదిగా ఉంటున్నదని, అందుకు ఆయన మళ్ళీ సిఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతారంటున్నారు బిఆర్‌ఎస్ నేతలు. గతంలో ఏ ముఖ్యమంత్రి వాడనటువంటి మాటలు రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే కెసిఆర్ ఎలా వస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి చావుకోరుకుంటున్నారంటూ, ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ఎంఎల్‌ఏ వీర్లపల్లి శంకర్ అన్నమాటలను గుర్తుచేస్తున్నారు. తాము కెసిఆర్ చావు కోరుకుంటున్నామని, ఆయన చావుతో తెలంగాణకు పట్టిన పీడ విరగడవుతుందని, వెయ్యిమందితో ఫామ్‌హౌజ్‌ముందు చావు డప్పు మోగిస్తామనడం కేవలం శంకర్ మాట్లాడిన మాటలు కావని, రేవంత్‌రెడ్డి మాట్లాడిచ్చినవేనంటు న్నారు బిఆర్‌ఎస్ నాయకులు వేముల ప్రశాంత్‌రెడ్డి. కాగా శంకర్ మాటలకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని బిఆర్‌ఎస్ ఇప్పుడు పట్టుపడుతున్నది.

———————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు