– సీఎంను కోరిన ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో అదనంగా రెండు వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆదివాసి, గిరిజన శాసనసభ్యులు పలు అంశాలపై వినతి పత్రాలు అందించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు ఇందిర గిరి జల వికాస పథకం అమలు చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు ఉన్నతీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలలో అశ్వరావుపేట, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖానాపూర్ శాసన సభ్యులు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, వెడ్మ బొజ్జు ఉన్నారు. వీరితోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్‌లు కూడా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





