14 ‌సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ

– కొత్తగా పర్సన్‌ ఇన్‌చార్జ్ ‌కమిటీల నియామకం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లాల పరిధిలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా సంఘాల పాత పాలక వర్గాల స్థానంలో కొత్త పర్సన్‌ ఇన్‌చార్జ్ ‌కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన కమిటీల పదవీకాలం ఆరు నెలలు లేదా సహకార సంఘాల తదుపరి ఎన్నికలు జరిగే వరకూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సంఘాల పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా, వారి సేవలకు ఎక్కడా అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. పీఏసీఎస్‌ల పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ పక్రియ పూర్తయ్యే వరకు ఈ నూతన పర్సన్‌-ఇన్‌-‌చార్జ్ ‌కమిటీలు బాధ్యతల్లో ఉంటాయి. ఈ సంఘాలలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న తీవ్ర పరిపాలనా లోపాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రుణాల వసూళ్ల పక్రియలో తీవ్ర జాప్యం జరగడం, గడువు ముగిసినా బకాయిలు చెల్లించని డిఫాల్టర్లపై పాత కమిటీలు ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోకపోవడం వంటి అంశాలపై సహకార శాఖకు నివేదికలు అందాయి. పాత పాలక వర్గాల నిర్లక్ష్యం కారణంగా సంఘాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో పాటు సంస్థాగతంగా తీవ్ర లోపాలు తలెత్తాయని నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలోనే సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి వీలుగా పాత కమిటీలను రద్దు చేస్తూ కొత్త కమిటీలను నియమించారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఈ 14 సంఘాల నూతన పర్సన్‌-ఇన్‌-‌చార్జ్ ‌కమిటీలు బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *