– మాజీ డీజీపీలకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల తొలగింపు
– భారీగా భద్రత కూడా తగ్గిస్తూ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్ట్‌లలో ఉన్న పోలీస్ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో మాజీ పోలీస్ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించనున్నారు. 20 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత అధికారులకు బుల్లెట్ వాహనాలు తీసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ డీజీపీలు స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ, పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, డీటి నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ మొదలైన అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాజీ అధికారులతో పాటు ప్రస్తుత అధికారులకు కూడా ఈ నిర్ణయం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లకు బులెట్ ప్రూఫ్ వాహనాలను తీసివేశారు. మాజీ డీజీపీలకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం తీసివేసింది పోలీస్ శాఖ.పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు ఉన్న గన్ మెన్‌ల సంఖ్య తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలావరకు వన్ ప్లస్ వన్ గన్ మెన్‌లకే పరిమితం చేసింది. నక్సల్స్ ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదా కానుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.