కాగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటన అద్బుతం

– అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే

– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల తీరును ఎండగట్టారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతోపాటు అవినీతి, అక్రమాలపై చర్చిద్దాం రండి అని సవాల్ విసిరారు. వారం ముందే రిహార్సల్స్ చేసుకుని నటిస్తున్నారని, అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులేనని వ్యాఖ్యానించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో డేట్, టైం, వేదిక ఫిక్స్ చేస్తాం.. ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు తాము సిద్ధమని, మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులు, అందించిన సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చిద్దాం రండి అని పిలుపునిచ్చారు. మీరు ఇట్లనే డ్రామాలాడితే జనం ఛీకొట్టడం ఖాయమన్నారు. ఈ రాజకీయ బిగ్ బాస్ షోలో ప్రజలు డబుల్ ఎలిమినేషన్ కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షిస్తున్నారని బండి పేర్కొన్నారు.

————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *