– ఏపీ సీఎం చంద్రబాబు
– హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
– హాజరైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు
మహాబలిపురం, ఆగస్టు 20: హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం మహాబలిపురంలో జరిగింది. ఈ సమావేశంకు ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సీఎం సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించడంతోపాటు దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసారు.విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదించిన చేసారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరిన ముఖ్యమంత్రి దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందన్నారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలనీ ప్రసంగంలో పేర్కొన్న సీఎం, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదనీ వెల్లడించారు. కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన చేసిన సీఎం, గోదావరి, కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. గంగా, కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరం అన్న చంద్రబాబు, నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని కొనియాడిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధి గురించి ఎంతో విజన్ తో మాట్లాడారన్నారు. విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రశంసించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం