– రేషన్ నిరాకరణపై సుప్రీం ఆశ్చర్యం
న్యూదిల్లీ, జూన్ 24: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో జాబితా నుంచి పేరు తొలగింపునకు గురైన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎస్‌ఐఆర్‌లో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా అంటూ కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్ర పరిధిలోని ప్రత్యేక కారణాలతో కూడిన అంశం కాబట్టి ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టును కాకుండా ముందుగా కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్. ప్రసన్న తన పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి కోరారు. రేషన్ నిరాకరణ వివాదంపై కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన వెకేషన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





