– రూ.17.48 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు
– బోనకల్ మండలంలో అభివృద్ధి పనుల జాతర
– మౌలిక వసతుల కల్పనే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం భట్టి
బోనకల్/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 24 : మధిర నియోజకవర్గ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభివృద్ధి పనుల జాతరను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి డిప్యూటీ సీఎం బుధవారం విస్తృతంగా పర్యటించి సుమారు రూ.17.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మధిర ప్రాంతంలో అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ, పట్టణాల అభివృద్ధి ప్రభుత్వానికి ప్రాధాన్యమని, ప్రతి గ్రామానికి మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ చేపట్టిన గ్రామీణ రహదారి పనులకు సుమారు రూ.17.48 కోట్ల పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత రైతులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. బోనకల్ మండలం చిరునోముల నుండి వత్సవాయి ఆర్ అండ్ బి రోడ్ వరకు రూ.320 లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్, ముష్టికుంట ఎస్సి కాలనీలో రూ. 73 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్, డ్రెయిన్ల నిర్మాణ పనులకు, ముష్టికుంట నుండి నాగులవంచ-చొప్పకట్లపాలెం పీఆర్ రోడ్ వరకు రూ.475 లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్, ముష్టికుంట నుండి గార్లపాడు వరకు రూ.550 లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్ నిర్మాణ పనులకు, బోనకల్ ఆర్ అండ్ బి రోడ్ నుండి చిరునోముల వరకు రూ.330 లక్షలతో నిర్మించనున్న బిటి రోడ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో ఆర్అండ్ఎస్ఈ యాకూబ్, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, డిపిఓ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





