సీఎం రేవంత్ కు హైకోర్టులో ఊరట

– కోవిడ్-19 నాటి కేసు కొట్టివేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2021లో జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమ యంలో కాంగ్రెస్ పార్టీ తరపున నాడు ఎంపీ, పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కమలాపూర్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి, అనుమతించిన దానికంటే ఎక్కువమందితో సభ నిర్వహించారనే ఆరోపణలతో కమలాపూర్ పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ ప్రచార సమయంలో తన క్లయింట్ అన్ని రకాల జాగ్రత్తలు పాటించారని, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతోనే నాటి ప్రభుత్వం ఈ కేసులను నమోదు చేయించిందని కోర్టుకు వివరించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యా యస్థానం, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తూ ఆయనపై ఉన్న కేసును కొట్టేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *