– హుజూరాబాద్ ఉప ఎన్నికల కేసు కొట్టివేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బండి సంజయ్‌పై నమోదైన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ వోటుకు రూ.25 వేల వరకు ఇస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. అలాగే వోటర్లకు రూ.5 వేల చొప్పున ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని బీఆర్‌ఎస్ కార్యకర్తలు పంచుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్ పోలీసులు బండి సంజయ్‌పై ఐపీసీ సెక్షన్లు 188, 171సీ, 505(2)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123(3ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





