– బీజేపీ ఎంపీ ఈటల విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో భాగంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి లేదా అయనకు సంబంధించిన వారి నుంచి స్పష్టత వచ్చిన తరువాత వాటిని క్లియర్ చేస్తున్నారన్నారు. ఇది నేరుగా సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపణలు చేశారు. భూముల విలువ ఎక్కువగా ఉన్నచోట ఈ తరహా దందా నడుస్తోందని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇది కేవలం బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో భాగమేనని అన్నారు. బాధితులు కాళ్లు అరిగేలా కలెక్టర్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారని ఎంపీ ఈటల తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




