బావమరిది మృతికి కేసీఆర్‌ సంతాపం

– భౌతికి కాయం వద్ద నివాళులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌ ‌రావు పార్ధీవ దేహానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌నివాళులర్పించారు. ఎర్రవల్లి నుంచి నేరుగా సుచిత్రలోని శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ ‌నివాళులు అర్పించిన అనంతరం శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట కేటీఆర్‌, ‌హరీశ్‌ ‌రావు, బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఉన్నారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *