– ఎండల తీవ్రతతో ప్రజల బెంబేలు
రామగుండం, ప్రజాతంత్ర, మే 21: రోళ్లు పగిలేలా ఎండలు తీవ్రంగా ఉండే రోహిణి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం రామగుండంలో ఎండ తీవ్రత ప్రమాదస్థాయిలో ఉన్నట్లు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. ఈమేరకు పారిశ్రామిక ప్రాంతంలోని పలువురి మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపించడంతో హడలెత్తిపోయారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచింది. అయితే నాలుగు రోజులుగా రామగుండంలో ఊహించని స్థాయిలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టాంటే భయపడుతున్నారు. చుట్టూ వివిధ భారీ పరిశ్రమలు ఉండటంతో మిగతా ప్రాంతాల కంటే గోదావరిఖనిలో ఎండ ప్రమాద స్థాయిలో ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ఆరంభం కానుండగా అప్పటి పరిస్థితి తలచుకుని భయపడుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




