హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొల్లూరు శ్రీ మూకాంబికా దేవిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ జగన్మాత మూకాంబికా దేవి కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే దీపావళి వెలుగులు ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షిస్తూ యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఆయన ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





