పాదయాత్రగా వచ్చి సీఎంను కలుసుకున్న ఏపీ వాసి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : సినీ తారలకే కాదు.. రాజకీయ నాయకులకూ అభిమానులు ఉంటారండోjáYT. ఈ కోవలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ అభిమాని ఉన్నాడు. హైదరాబాద్‌లోని రేవంత్‌రెడ్డిని కలవాలన్న కుతూహలంతో 350 కిలోమీటర్ల సుదూరంలో ఉన్న కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నుంచి తాయన్న అనే వ్యక్తి హైదరాబాద్‌కు కాలినడక ప్రారంభించాడు. గత నెల 29వ తేదీన ఆదోని నుంచి తాయన్న పాదయాత్ర ప్రారంభించి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనను కలుసుకుని తన అభిమానాన్ని చాటుకుని ఆనంద పరవశుడయ్యాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా తన అభిమానిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *