వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

– అధికార పార్టీ తీరుకు నిరసనగా విపక్షాల వాకౌట్‌

‌న్యూదిల్లీ, జూలై 29 : జాతీయ గేయం వందేమాతరంపై బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ ‌నెల 24న ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయను న్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌  ‌టు నేషనల్‌ ఆనర్‌-1971‌లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. బిల్లుపై సభలో చర్చ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేతలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇటీవల దిల్లీలో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. చర్చలో పాల్గొనాలని సభ్యులను డిప్యూటీ ఛైర్మన్‌ ‌హరివంశ్‌ ‌పదేపదే కోరినప్పటికీ ఆందోళనలు విరమించలేదు. కేంద్ర సహాయ మంత్రి రాందాస్‌ అథవాలె బిల్లుపై మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *