పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారు

– ఖర్గే వ్యాఖ్యలను తిప్పికొట్టిన నడ్డా

న్యూదిల్లీ, జూలై 29 : దిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తప్పుబట్టారు. ఈ విషయంపై రాజ్యసభలో మాట్లాడుతూ.. అణచివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. దీనిపై కేంద్రమంత్రి జేపీ నడ్డా  స్పందిస్తూ.. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తాను కూడా చాలాసార్లు అరెస్టయినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ‌పాలనలో ఎమర్జెన్సీ విధించినప్పుడు పోలీసులు తనను తరగతి గదిలోనే అరెస్ట్ ‌చేశారని వెల్లడించారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే ఏ విద్యార్థి అయినా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శాంతిభద్రతలను కాపాడటానికి, ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని నడ్డా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. సీజేపీకి మద్దతుగా ఆందోళనల్లో పాల్గొన్నందుకు పోలీసులు బుధవారం సీపీఎం ఆఫీస్‌పై దాడి చేశారని ఆ పార్టీ ఎంపీలు చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి ఖండించారు. దీంతో రాజ్యసభలో కొంతసేపు గందరగోళం నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *