– ఒకే ఊళ్లో వేర్వేరుచోట్ల ఉరేసుకుని మృతి
నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 18: జిల్లాలో వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం చదువుతున్న యువతి ప్రిపరేషన్ హాలిడేస్ నిమిత్తం స్వగ్రామమైన మునుకుంట్లకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో దూలానికి ఉరివేసుకున్న స్థితిలో యువతి కనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె సోదరి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు.. యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ కూడా తమ వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం చరణ్ మరో వ్యక్తితో కలిసి యువతి ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాతే ఈ రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో యువతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ బలవంతం చేశాడా, లేదా మరేదైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వహాస్పిటల్‌కి తరలించారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



