ఆసిఫాబాద్‌ ‌రైల్వే స్టేషన్ ‌సమీపంలో హత్య

– వృద్దుడిని నరికి చంపిన దుండగులు

కొమురంభీం ఆసిఫాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై17 : జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌ ‌రోడ్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సపంలో ఒక వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. నిందితులు వృద్ధుడి తలను, మొండాన్ని వేరు చేసి పడేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్‌ ‌పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పాత కక్షలా లేక మరేదైనా వివాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ ‌టీమ్‌, ‌డాగ్‌ ‌స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుడు ఎవరు అనే విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తూ విచారణను వేగవంతం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *