సైదాబాద్‌ ‌స్కూల్‌పై తల్లిదండ్రుల ఫిర్యాదు

– పోలీసుల కేసు నమోదు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై17: నగరంలోని సైదాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ స్కూళ్లో వివాదాస్పద ఇస్లాం బోధనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడంతో తల్లిదండ్రుల ఫిర్యయాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సైదాబాద్‌  ఓ ‌ప్రైవేట్‌ ‌పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థితో బలవంతంగా ఇస్లామిక్‌ ‌ప్రార్థనలు చేయించడం తీవ్ర సంచలనం రేపింది. క్లాస్‌ ‌రూమ్‌లో సదరు బాలుడితో కల్మాలో భాగమైన సూరా అల్‌-‌ఫాతిహా పఠనం చేయాలని ఆదేశించడం తీవ్ర వివాదానికి దారితీసింది. రోజూ దానిని చదవాలంటూ స్కూల్‌ ‌డైరీలో ’సూరా అల్‌ ‌ఫాతిహా’ అని రాసి ఒత్తిడి తెచ్చారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా స్కూల్‌ ‌యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రవర్తించడం వల్లే తమ కుమారుడు భయాందోళనకు గురై రోజూ ఏడుస్తూ ఇంటికి వస్తున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల వల్ల తమ మత స్వేచ్ఛతో పాటు తల్లిదండ్రుల హక్కులకు భంగం కలిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైదాబాద్‌ ‌పోలీసులు ప్రాథమిక సమాచార నివేదిక నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్‌, ‌యాజమాన్యం, క్లాస్‌ ‌టీచర్‌లను నిందితులుగా చేరుస్తూ..  కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాలుడిపై మానసిక ఒత్తిడి తెచ్చిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని సైదాబాద్‌ ‌పోలీసులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *