– ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 17: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు రాములు (60), రషీద్ (40)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే కీసర పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతులిద్దరూ మెదక్ జిల్లా వాసులుగా తెలుస్తోంది. ట్రాలీ ఆటోను ఢీకొట్టిన అనంతరం గుర్తుతెలియని వాహన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వహాస్పిటల్‌కి తరలించారు. ఇద్దరి మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దుc



